ETV Bharat / city

వెంకన్నకు అన్నమయ్య కీర్తనలు రాస్తే.. చేతన్ యానిమేషన్ చేశాడు! - తిరుపతి యానిమేటర్ చేతన్ న్యూస్

ఆశలు.. ఆశయాలకు ప్రతిరూపం.. యువత. సరికొత్త లక్ష్యాలతో కొత్త ఏడాదిని ప్రారంభించిన నవతరానికి కరోనా రూపంలో అతిపెద్ద సవాలు ఎదురైంది. లాక్‌డౌన్ ఆంక్షలతో ఎటూ కదలకుండా బందీగా చేసింది. విలువైన కాలం వృథా అయిందని నిరాశ చెందిన వారు కొందరైతే... ఖాళీ సమయాన్ని తమలోని ప్రతిభ మెరుగుపరుచుకునేందుకు ఉపయోగిస్తున్న వారు మరికొందరు. ఈ కోవకు చెందిన యువకుడే...తిరుపతికి చెందిన చేతన్ కుమార్‌. తనకున్న యానిమేషన్ ప్రతిభను ఆధ్యాత్మిక నగరి వైశిష్టాన్ని ఘనంగా చాటేందుకు వారధిగా ఎంచుకున్నాడు.

వెంకన్నకు అన్నమయ్య కీర్తనలు రాస్తే.. చేతన్ యానిమేషన్ చేశాడు!

author img

By

Published : Jul 11, 2020, 1:50 PM IST

వెంకన్నకు అన్నమయ్య కీర్తనలు రాస్తే.. చేతన్ యానిమేషన్ చేశాడు!

అందమైన చిత్రాలను... కదిలేలా చేస్తూ వాటికి ప్రాణం పోస్తాడు చేతన్ కుమార్ రెడ్డి. తిరుపతిలోని కాకతీయనగర్​కు చెందిన కుర్రాడు. నగరంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో 2018లో బీటెక్ పూర్తి చేసిన చేతన్​కు దర్శకత్వం, యానిమేషన్ అంటే మక్కువ ఎక్కువ. చదువుకునే రోజుల్లోనే సెల్​ఫోన్లతో లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. స్నేహితులే కెమెరాను కొనిచ్చి ప్రోత్సహించారు. అలా ఏడేళ్లుగా దర్శకత్వం, ఎడిటింగ్, యానిమేషన్, సినిమాటో గ్రాఫర్ ఇలా విభిన్న రంగాల్లో చేతన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పుడు తిరుపతి విశిష్ఠతను చెప్పేందుకు సిద్ధమయ్యాడు.

కరోనా మహమ్మారి కారణంగా.. ప్రభుత్వం విధించిన ఆంక్షలతో లఘు చిత్రాలను తీసేందుకు అవకాశం లేకపోవటంతో తనకు దొరికిన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలని ఆలోచించాడు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుమల క్షేత్ర ప్రాశస్త్యం, కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవారి ఆలయ చరిత్రలో ప్రజలకు పెద్దగా తెలియని విశేషాలను కథలుగా మలిచే ప్రయత్నం ప్రారంభించాడు. చిత్రకారిణి పవిత్రతో కలిసి తాను అనుకున్న అంశాలను చర్చించాడు. తిరుమల ధ్వజ స్తంభం పున:ప్రతిష్ఠ, తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో విగ్రహం వెనకున్న విశేషాలను...అందమైన చిత్రాలుగా మలిస్తే...వాటికి చేతన్ తన యానిమేషన్ ప్రతిభతో ప్రాణం పోశాడు. యునైటెడ్ తిరుపతి అనే యూట్యూబ్ ఛానల్​ ప్రారంభించి.. లాక్ డౌన్ సమయంలో చేసిన వీడియోలను పోస్ట్ చేయగా.. పలువురు చరిత్రకారులు, శ్రీవారి భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు చేతన్​పై ప్రశంసలు కురిపించారు.

కళాశాల సమయం నుంచే సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా తీసుకుని.. స్థానికంగా ఉండే యువతీయువకులతోనే లఘు చిత్రాలను రూపొందించాడు. ఆడపిల్లలపై అమానుషాలు, మనిషిలో స్వతహాగా సహజ ప్రతిభ... దానికి అందివ్వాల్సిన ప్రోత్సాహం ఇలా పలు విభిన్న అంశాలపై పది లఘు చిత్రాలను తీశాడు. కల, సొసైటీ, కన్నీరు, నైట్ బ్లైండ్ నెస్ లాంటి లఘు చిత్రాలు అతనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

సమాజంపై తనకున్న బాధ్యతను.. భుజాలకెత్తుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చేతన్ చురుగ్గా పాల్గొంటున్నాడు. 'హార్ట్ ఫుల్లీ హెల్పింగ్ హ్యాండ్స్' అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి.. లాక్ డౌన్ సమయంలో వందల మందికి అన్నదానం చేయటంతోపాటు మూగజీవాల ఆకలి తీర్చి ఆదుకున్నారు. కేవలం తిరుపతికే పరిమితం కాకుండా మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తమ సేవా కార్యక్రమాలను చేతన్ విస్తరించాడు.

ఇదీ చదవండి: గర్భిణీని తన వాహనంలో ఆస్పత్రికి తరలించిన ఏఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.