ETV Bharat / city

Amaravathi Farmers Sabha: తిరుపతి నడిబొడ్డున "సభా సంగ్రామం".. నలుదిక్కులా అమరావతి పొలికేక! - ap capital issue

Amaravathi Farmers Sabha: ఏకైక రాజధానిగా అమరావతిని ఒప్పుకునేదాకా.. రాజధాని పరిరక్షణ పోరాటం ఆపేదిలేదని.. అమరావతి రైతులు తేల్చిచెప్పారు. తిరుపతిలో పాదయాత్ర ముగింపు సభలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించారు. ప్రభుత్వం తమను వేధిస్తోందని.. వాపోయారు. సభకు హాజరైన పలు రాజకీయపక్షాలు.. ప్రభుత్వ వైఖరిని దునుమాడాయి. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి.

Amaravathi Farmers Sabha
Amaravathi Farmers Sabha
author img

By

Published : Dec 17, 2021, 10:44 PM IST

Updated : Dec 18, 2021, 6:50 AM IST

Amaravathi Farmers Sabha: తిరుపతి నడిబొడ్డున "సభా సంగ్రామం".. నలుదిక్కులా అమరావతి పొలికేక!

Amaravathi Farmers Sabha: ధ్యాత్మిక నగరం తిరుపతి ‘జై అమరావతి’ నినాదంతో దద్దరిల్లింది. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ధారపోసిన రైతుల సుదీర్ఘ పాదయాత్రకు వేంకన్న సన్నిధిలో బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా సభకు పోటెత్తిన ప్రజానీకం.. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్న ఆకాంక్షకు అద్దం పట్టింది. మరోవైపు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తెచ్చింది. మూడు రాజధానులంటూ దోబూచులాడుతున్న ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగింది.

‘అమరావతే ఏకైక రాజధాని’ అనే నినాదంతో..

తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, జనసేన, సీపీఐ .. ఇలా విపక్ష నేతలందరూ ‘అమరావతే ఏకైక రాజధాని’ అని ముక్తకంఠంతో నినదించారు. ప్రతిపక్ష నేత హోదాలో అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్‌.. ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని రైతులు తేల్చిచెప్పారు.

వారసత్వంగా వస్తున్న భూములను అప్పగించి, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి వెలుస్తోందని సంతోషించిన రైతులు... రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా గర్జించారు. నామరూపాలు కోల్పోయిన తమ పంట భూముల మాదిరే రాష్ట్ర ప్రజల ఆశలు గల్లంతయ్యాయని మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చి, తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభతో రాష్ట్ర, దేశ దృష్టిని ఆకర్షించారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా ప్రజలు పెద్దసంఖ్యలో సభకు తరలివచ్చి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. సభ జరుగుతున్నంతసేపు జై అమరావతి నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. అమరావతే మన రాజధాని అంటూ నినదించారు. సభికులంతా ఆకుపచ్చ కండువాలు, టోపీలు ధరించారు. సభా ప్రాంగణంలో ఉదయం నుంచే కోలాహలం నెలకొంది. తిరుపతిలోని రామానాయుడు కల్యాణ మండపం వద్ద బస చేసిన పాదయాత్రికులు అందరికంటే ముందే అక్కడికి చేరుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా బారికేడ్లను ఏర్పాటు చేయించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సభ ప్రారంభానికి ముందు తిరుపతి పశ్చిమ డీఎస్పీ నర్సప్ప వేదికపైకి వచ్చి ఐకాస నేతలతో మాట్లాడారు. గణపతి పూజతో సభను ప్రారంభించారు. తర్వాత హిందు, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులు ప్రార్థనలు చేశారు. ముందుగా అమరావతి రైతులు తమ కష్టాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తే తమకు లాఠీ దెబ్బలు మిగిలాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ ఉద్వేగానికి లºనయ్యారు.

పాటకు పరవశించి...
సభ ప్రాంరంభానికి ముందు కళా బృందాల నృత్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. ఇదే సమయంలో ‘రాజధాని అమరావతి ఆంధ్ర ప్రజల ఊపిరి’’ అంటూ కళా బృందం సభ్యులు నృత్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సభలోని వారంతా నిల్చుని చేతిలో ఆకుపచ్చ కండువాలు ఊపుతూ ఉత్సాహపర్చారు. ఇదే సమయంలో సభావేదికపై ఆశీనులైన నేతలు కూడా అమరావతికి జై అంటూ నినాదాలు చేశారు. సభా ప్రాంగణం మొత్తం ఆకుపచ్చని కండువాల రెపరెపలతో కళకళలాడింది.

వైకాపా నుంచి రఘురామ హాజరు
సభకు అధికార వైకాపా మినహా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని ఐకాస నేతలు చెబుతున్న సమయంలో తాను వచ్చినట్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు ముందుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది. సీపీఐ నారాయణ, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించారు. రఘురామకృష్ణంరాజు, చంద్రబాబులు ఆలింగనం చేసుకున్నారు. ఇదే సమయంలో వేదికపైకి ఎక్కే సమయంలో చంద్రబాబు.. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పలుకరించారు. అంతకుముందు సభా వేదికపైకి వచ్చే ముందు చంద్రబాబునాయుడు శ్రీవారి రథం వద్దకు వెళ్లి దండం పెట్టుకున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వక్తలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆయన కేవలం సుమారు 15 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సాయంత్రం 6 గంటలలోపే తాను ప్రసంగాన్ని ముగిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా అమరావతి కరకట్ట దాటి తొలిసారిగా తిరుపతిలో నిర్వహించిన సభ విజయవంతం కావడం పట్ల ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి సభకు న్యాయవాదులు
తిరుపతిలో జరిగిన అమరావతి మహోద్యమ సభకు పలువురు న్యాయవాదులు తరలివచ్చారు. సభకు ప్రజలు తరలిరాకుండా పోలీసులు ఆటంకాలు సృష్టించారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. సభకు ఎంత మంది రావాలనే నిబంధన ఎక్కడా లేదని, ఎలాంటి షరతు కూడా న్యాయస్థానం పెట్టలేదని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. సభకు వచ్చే వారిని గృహ నిర్బంధం చేయడంపై కోర్టు దృష్టికి తీసుకెళతామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పోలీసులు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. భూములిచ్చిన రైతులపై కేసులు పెడుతున్నారని, అదే 12 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం అన్నారు. న్యాయస్థానంలో అమరావతి కేసులు వాదించి, వాటిని గెలిచామని వివరించారు.

సిద్ధాంతాలు వేరైనా.. నినాదం ఒక్కటే

సిద్ధాంతాలు వేరైనా విపక్ష పార్టీలన్నీ ప్రజల కోసం ఒక్కటయ్యాయి. సైద్ధాంతిక విభేదాలు పక్కనపెట్టి అమరావతి నినాదానికి కట్టుబడ్డారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినదించాయి.. రైతులు, మహిళలు చేస్తున్న ధర్మపోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెదేపా, కాంగ్రెస్‌, భాజపా, సీపీఐ, జనసేనల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తరలివచ్చి రైతులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం భవిష్యత్తులో రైతులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.

‘అమరావతి’ కోసం శ్రీవారిని ప్రార్థించా: చంద్రబాబునాయుడు

రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... అమరావతి రైతుల సభకు హాజరయ్యేందుకు వెళుతూ శ్రీవారి ఆశీస్సులు అందుకున్నానని, రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని ప్రార్థించానన్నారు.

ఇదీ చదవండి

Ministers Comments On Amaravati: 'మూడు రాజధానులు వచ్చి తీరుతాయి'

Last Updated : Dec 18, 2021, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.