ETV Bharat / city

Tirumala: 'అలిపిరి-తిరుమల నడకదారి పనులు త్వరగా పూర్తిచేస్తాం'

అలిపిరి-తిరుమల నడకమార్గంలో పనులు వేగంగా చేపడతామని.. తితిదే(ttd) అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నడకదారి పైకప్పు నిర్మాణం పనులు వేగంగా చేయడం కోసం జులై 30 వరకు భక్తులను అలిపిరి కాలినడక మార్గంలో అనుమతించడం లేదన్నారు. తిరుమలకు నడిచి వచ్చే భక్తులు.. శ్రీవారి మెట్టు మార్గంలో రావాలని ఆయన కోరారు.

works at foot way
అలిపిరి-తిరుమల మెట్టుమార్గంలో నడకదారి పనులు వేగంగా చేస్తాం
author img

By

Published : Jun 2, 2021, 8:20 PM IST

అలిపిరి నుంచి తిరుమల(tirumala)కు వెళ్లే నడకదారి పనులను వేగంగా పూర్తి చేస్తామని.. తితిదే(ttd) అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నడకదారి పైకప్పు నిర్మాణం పనులు వేగంగా చేయడం కోసం జులై 30 వరకు భక్తులను అలిపిరి కాలినడక మార్గంలో అనుమతించడం లేదని తెలిపారు. కరోనా వల్ల నడకదారిలో భక్తులు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారని.. పైకప్పు పనులు వేగంగా పూర్తి చేయడానికి ఇదే సరైన సమయమనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమలకు నడిచి వచ్చే భక్తులు.. శ్రీవారి మెట్టు మార్గంలో రావాలని ధర్మారెడ్డి సూచించారు.

ఉచిత బస్సులు...

నడకదారిలో వచ్చే భక్తుల కోసం తిరుపతి రైల్వే స్టేషన్, అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్టు ధర్మారెడ్డి వెల్లడించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు అనుమతి ఉంటుందని వివరించారు. కరోనా తీవ్రత దృష్ట్యా.. జూన్ నెలలో రోజుకు 5 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రమే ఇచ్చినట్లు తెలిపారు. రాత్రి 8 గంటలకు దర్శనం పూర్తవుతుండగా.. 9 గంటలకు స్వామివారి ఏకాంత సేవ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

కరోనా తీవ్రతను అంచనా వేశాక.. తితిదే ఛైర్మన్, ఈవోతో సమీక్షించి టికెట్ల సంఖ్య విషయంలో.. నిర్ణయం తీసుకుంటామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఈ నెల 4న తితిదే ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.