వరదలు, తుపాన్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయనున్నట్టు జనసేన ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్‌లో ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమహేంద్రవరంలో అన్నారు. 17 లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.... రైతులకు 30 వేల రూపాయల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు. కర్షకులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
మరోవైపు రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని.... అది అమరావతే కావాలని మనోహర్ ఆకాంక్షించారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు విడతల వారీగా కొనసాగుతున్నాని చెప్పారు.
ఇదీ చదవండి