ETV Bharat / city

ఆగిన యంత్రం.. కుదేలైన శీతల పానీయాల విక్రయం

చెరకు రసం అమ్మడం ద్వారా ఏడాదికి సరిపడా ఆదాయాన్ని ఆర్జించే బీరయ్య ఈ ఏడాది నిండా మునిగారు. తెలంగాణలోని మెదక్‌కు చెందిన చిరువ్యాపారి ఖైరతాబాద్‌లో చెరకు రసం బండి నడిపిస్తుంటారు. ఏటా ఫిబ్రవరిలో రైతులకు బయానా ఇచ్చి చెరకు సరఫరాకు ఒప్పందం చేసుకుంటారు. ఈ ఏడాదీ అదే తీరులో సిద్ధమవ్వగా ఎండలు ముదిరేలోపే వ్యాపారంపై కరోనా కాటుపడింది. లాక్‌డౌన్‌తో వ్యాపారం మూతపడింది. నగరంలో, జాతీయ రహదారుల వెంట దాదాపు 12వేల చెరకు యంత్రాలు ఇలాగే మూలకు చేరాయి.

ఆగిన యంత్రం.. కుదేలైన శీతల పానీయాల విక్రయం
ఆగిన యంత్రం.. కుదేలైన శీతల పానీయాల విక్రయం
author img

By

Published : Apr 13, 2020, 12:42 PM IST

కరోనా దెబ్బకు కాలానుగుణంగా నడిచే(సీజనల్‌) వ్యాపారాలు కుప్పకూలాయి. వేసవిలో జోరుగా సాగే చెరకు రసం, శీతల పానీయాలు, ఐస్‌క్రీం సంబంధిత వ్యాపారాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి - జూన్‌ మధ్య హైదరాబాద్​తో పాటు ప్రధాన రహదారుల వెంట చెరకు రసం విక్రయాలు జోరుగా సాగుతాయి. మన రాష్ట్రం నుంచి తెలంగాణకు చెరకు తీసుకెళ్లి.. రసం విక్రయిస్తూ వేసవిలో రెండుచేతులా సంపాదించే వారికి ఈ ఏడాది నిరాశే మిగిలింది.

చెరకును దిగుమతి చేసుకుని రోజువారీగా విక్రయించే అడ్డాలు సైతం నగరంలో వందలాదిగా ఉండగా వాటిని నిర్వహించే వ్యాపారులూ నష్టపోయారు. వేసవి కోసం ముందుగా రైతులకు ఒక్కో వ్యాపారి రూ.లక్షల్లో అడ్వాన్సులు చెల్లించిన పరిస్థితి ఉంది. ఫలూదా, షర్బత్‌, లస్సీ తదితరాల తయారీ, విక్రయాలు బంద్ అయ్యాయి. వీటిపై వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఈ వ్యాపారాలకు అనుబంధంగా ఐస్‌ను తయారు చేసే చిన్నతరహా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి.

కొవిడ్‌ నుంచి కోలుకునేలోపు ఈసారి వేసవి గడిచిపోనుండటం విక్రయదారుల ఆదాయంపై కోలుకోలేని దెబ్బతీసినట్లు అయింది.

ఇవీచూడండి: నింగినంటిన 'నిత్యావసరం': కొనేదెలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.