ETV Bharat / city

Dussehra Celebrations : రాష్ట్రవ్యాప్తంగా విజయదశమి వేడుకలు - చిత్తూరులో మార్వాడీల దాండియా

రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

Dussehra Celebrations
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా విజయదశమి వేడుకలు
author img

By

Published : Oct 15, 2021, 1:40 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా విజయదశమి వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

శరన్నవరాత్రుల ముగింపు విజయదశమి పర్వదినాన పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆధ్యాత్మిక శోభను పరిమళింప చేస్తున్నాయి. పాలంగిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేటితో ఉత్సవాలు ముగియనున్నాయి. విజయదశమి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

తణుకు పట్టణంలోని కనకదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారం దర్శనమిస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరిగా పూజలందుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దువ్వలో కొలువైన శ్రీ దానేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

విజయదశమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ఆలయాల వద్ద కుంకుమ పూజలు చేశారు. అమలాపురం మొదలుకొని కోనసీమ వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలలో భక్తులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మార్వాడీలు దాండియా నృత్యాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కృష్ణా జిల్లా వేమమవరం శ్రీ కొండాలమ్మ వారి దేవస్థానంలో విజయదశమి పర్వదిన వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, పొంగళ్ళు సమర్పిస్తూ తమ మొక్కులను తీర్చుకున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారికి నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య రూ.17.50 లక్షల విలువైన 345 గ్రాముల మేలిమి బంగారంతో చేయించిన కిరీటాన్ని సమర్పించారు.

కడపలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి శాలలో వాసవి మాత భక్తులకు దర్శనమిచ్చారు. విజయదుర్గా దేవి ఆలయంలో కూడా దసరా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపు కుంటున్నారు కడప లోని అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు జరగనుంది.

ఇదీ చదవండి : VIJAYAWADA: ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.