తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్ కేసు దస్త్రాన్ని రాష్ట్రపతి కార్యాలయం సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ చేపట్టాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తనకు నక్సలైట్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలని సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్.. గతంలో రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ లేఖపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. రాష్ట్ర జీఏడీ సహాయ కార్యదర్శి జనార్దన్‌బాబుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. బాధితుడు ప్రసాద్‌కు ఆయన్ను కలవాలని సూచించింది. అయితే జనార్దన్‌బాబును కలిసినా.. సరైన స్పందన లేదని ప్రసాద్ వాపోయాడు. ఈ క్రమంలో మరోసారి స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. కేసు దస్త్రాన్ని సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి..