తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొండల శివ, దుర్గల 12 ఏళ్ల కుమారుడు అభిషేక్ పుట్టినప్పటి నుంచి అచేతనంగా పడి ఉంటున్నాడు. నిలబడలేడు.. కూర్చోలేడు.. మాట్లాడలేడు.. కళ్లు పూర్తిగా తెరిచి చూడలేడు. ఆకలేస్తోందని అడగలేడు. తరచూ అతనికి ఫిట్స్ వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అప్పులు చేసి ఆసుపత్రులకు తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. తండ్రి శివ కాంక్రీటు హెల్పర్‌గా పనిచేస్తున్నారు. అతడి సంపాదన అంతంతమాత్రమే. అభిషేక్‌కు దివ్యాంగ పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా వేలిముద్రలు, ఐరిస్ వేసే స్థితిలో లేకపోవడంతో మంజూరు కాలేదు. అధికారులు స్పందించి బాబుకు వైద్యసాయంతోపాటు వికలాంగ పింఛను అందించాలని అభిషేక్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండీ.. చలో తాడేపల్లికి అనుమతి నిరాకరణ... రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్‌లు