కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎంపీ మార్గాని భరత్. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఈ విషయంపై ఉన్నతాధికారులు, వైద్యులతో ఆయన సమీక్షించారు. జిల్లా జీసీహెచ్ఎస్ రమేష్‌కిషోర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సోమసుందర్రావు, వైద్య సిబ్బంది హాజరయ్యారు. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలకు అవగాహన, వైద్యసేవలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముందు జాగ్రత్తగా ఒక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ అనుమానిత కేసులు రెండు వచ్చాయని వాటి ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు.
కరోనాను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు చేపట్టిందని ఎంపీ భరత్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్‌కు సంబంధించి కాకినాడ జీజీహెచ్‌లో 30 నుంచి 40, రాజమహేంద్రవరంలో 15 ఐసొలేషన్ రూంలు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ వెల్లడించారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి వారిని హోం ఐసోలేషన్ చేస్తున్నామన్నారు. అనుమానితులను కాకినాడ, రాజమహేంద్రవరం తరలించి పరిశీలిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: