వైఎస్ వివేకా హత్య కేసులో వెనక ఉందెవరన్నది ముఖ్యమంత్రి జగన్ నిగ్గు తేల్చాలని తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఇంటి దొంగలు, కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నందునే.. సీఎం జగన్ ఆ కేసును పక్కదారి పట్టించారని ఆరోపించారు. తెదేపా హయాంలో సీబీఐ విచారణ వేశామని.. వైకాపా అధికారంలోకి వచ్చాక దోషుల్ని నిర్థారించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రతిపక్షాల అణిచివేత మీద ఉన్న శ్రద్ధ బాబాయి హత్య కేసు విచారణపై ఎందుకు లేదని అన్నారు. వివేకా హత్య కేసులో నేరస్థుల్ని శిక్షించాలని బుచ్చయ్య అన్నారు.
ఇదీ చదవండి: