సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఉదయం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఆచార్య సినిమా చిత్రీకరణ కోసం వచ్చిన ఆయనకు.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. అలాగే విమానాశ్రయం బయట భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.
చిరంజీవి విమానాశ్రయానికి చేరుకోగానే.. అభిమానులు పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. వారికి మెగాస్టార్ అభివాదం చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి బూరుగుపూడి చెక్ పోస్ట్ వరకు అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఇదే చిత్ర విషయమై గత నాలుగురోజులుగా సినీ నటుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మారేడుమిల్లిలోని షూటింగులో ఉన్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో.. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం మారేడుమిల్లిలోని.. పర్యాటక ప్రాంతమైన గుడిసె వద్ద సెట్స్ వేశారు. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా షూటింగ్ జరిగింది. తాజాగా ఆచార్య సినీ బృందం రావటంతో ఏజెన్సీలో సందడి నెలకొంది.
ఇదీ చదవండి: