రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మాజీమంత్రి కొల్లు రవీంద్ర విడుదల అయ్యారు. 53 రోజులపాటు జైలులో ఉన్న కొల్లు రవీంద్రకు...మంగళవారం బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. వైకాపా నేత మోకా భాస్కర్ హత్య కేసులో కొల్లు రవీంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: అనుమతులిచ్చిన అధికారులను ఈ కేసులో ఎందుకు చేర్చొద్దు?:హైకోర్టు