సీఎం జగన్పై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో జగన్కు శిక్ష పడటం ఖాయమని జోస్యం చెప్పారు. కేసుల విచారణకు జగన్ ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. పదవులతో సంబంధం లేకుండా విచారణకు సహకరించాలి కదా అని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్లు తెదేపా నేతలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐటీ సోదాలపై సంబంధిత శాఖ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెదేపా నేతల పేర్లు లేవని అన్నారు. వివేకా హత్యకేసుపై ఎన్నిసార్లు మాట మారుస్తారని సీఎం జగన్ను నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టారన్న ఆయన...వాటికి లెక్కలు చూపించారా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : రాజధానుల ప్రకటనతో స్థిరాస్తి రంగానికి ఎదురుదెబ్బ