రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( former MP Undavalli Arun Kumar news). రాజమహేంద్రవరంలో మాట్లాడిన ఆయన.. అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటపడేస్తారనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం సీఎం జగన్పై ఉందన్నారు( financial crisis in andhrapradesh news). ప్రస్తుతం ఉన్న ఆదాయం.. జీతాలు ఇవ్వడానికే సరిపోతుందని.. ఈ పరిస్థితుల్లో అప్పులు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ఇలాగే ఉంటే తర్వాత వచ్చే ప్రభుత్వం.. చేయడానికి ఏం ఉండదన్నారు. మటన్, చికెన్ షాపులు పెడుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి