ETV Bharat / city

HRC: హెచ్​ఆర్​సీ ఛైర్మన్​ను కలిసిన డ్రైవర్​ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు.. - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

AP HRC CHAIMAN: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని మృతుడి తల్లిదండ్రులు హెచ్​ఆర్​సీ కోరారు. 58 పేజీల కేసు వివరాలు, కాకినాడ జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడిన సీడీతోపాటు 7 పేజీల ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్​కు సమర్పించారు.

HRC
హెచ్​ఆర్​సీ ఛైర్మన్ జస్టిస్‌ సీతారామమూర్తిని కలిసిన డ్రైవర్​ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు
author img

By

Published : Jun 30, 2022, 4:35 PM IST

AP HRC CHAIMAN: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను చంపిన కేసులో..వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని మృతుడి తల్లిదండ్రులు రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని కోరారు. రాజమహేంద్రవరంలో హెచ్​ఆర్​సీ ఛైర్మన్ జస్టిస్‌ సీతారామమూర్తిని బాధిత కుటుంబ సభ్యులతోపాటు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు కలిసి ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్​ హత్యకేసులో కాకినాడ పోలీస్ అధికారులు చట్టబద్ధ విధులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, విచారణ నిర్లక్ష్యానికి కారణమయ్యారని ఫిర్యాదు చేశారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడి, ముద్దాయిలకు సహకరించేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్​కు విజ్ఞప్తి చేశారు. 58 పేజీల కేసు వివరాలు, కాకినాడ జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడిన సీడీతోపాటు 7 పేజీల ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్​కు సమర్పించారు.

హెచ్​ఆర్​సీ ఛైర్మన్ జస్టిస్‌ సీతారామమూర్తిని కలిసిన డ్రైవర్​ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.