Building Balcony Collapse: కాకినాడ శ్రీనగర్లో ఓ భవంతి పైకప్పు కూలింది. ఆ సమయంలో బాల్కని కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 1995లో కట్టిన ఈ భవంతి నాణ్యత పై గతంలోనే నగర పాలక సంస‌్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తింది. 15 కుటుంబాలు ఈ భవంతి లో నివాసముంటున్నాయి, ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పదిరోజుల్లో ఖాళీ చేయాలని వారికి నోటీసులిచ్చారు.
ఇదీ చదవండి : వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి