తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఎస్‌ఈబీ పోలీసులు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ గ్రామీణ మండలం నేమం వద్ద 20,479 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. దీని విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి చింతపల్లి వైపు తరలిస్తున్న 8,800 నాటు సారా ప్యాకెట్లతో పాటు... 240 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని... ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వాహనం సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: అవాక్కయిన జనం.... విచారణ చేస్తామన్న పోలీసులు...