గత నవంబర్లో కురిసిన వర్షాల వల్ల నెల్లూరులో పెన్నా నదికి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి వారధి తెగిపోయింది. నీటిపారుదల శాఖ అధికారులు రూ. 27 లక్షలు పెట్టి మరమ్మతులు చేశారు. అనంతరం జనవరి మొదటి వారంలో కురిసిన వర్షాల వల్ల మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. వారధి తెగిపోయి ఇప్పటికి ఇరవై రోజులు కావస్తున్నా.. నేటికి మరమ్మతు పనులు పూర్తి కాలేదు. ఈ జాప్యంతో సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువ ఆయకట్టు రైతులు.. నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి త్వరగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అధికారులేమంటున్నారు...?
వర్షాల వల్ల ఇప్పటికే నాలుగు సార్లు పెన్నా వారధి తెగిపోయింది. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తిచేసి.. సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువ ఆయకట్టు రైతులకు నీరు అందిస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు. -కృష్ణారావు, జలవనరుల శాఖ ఎస్ఈ, నెల్లూరు జిల్లా.
ఇదీ చదవండి: