ETV Bharat / city

Venkaiahnaidu: రాజ్యాంగ పరమైన పదవిలో కన్నా అందులోనే ఆనందం

రాజ్యాంగ పరమైన పదవిలో కన్నా జనంతో కలిసిమెలిసి ఉన్నప్పుడే ఎక్కువ ఆనందం ఉంటుందని.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. దేశ పురోగతిలో కీలక పాత్ర పోషించే పత్రికలు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. పర్యటన మొదటిరోజు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
author img

By

Published : Nov 12, 2021, 4:57 PM IST

Updated : Nov 13, 2021, 3:05 AM IST

నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ….అధికారులు వెంకటాచలం రైల్వే స్టేషన్ లో స్వాగతం పలికారు. అనంతరం స్వర్ణభారతి ట్రస్ట్ లో విశ్రాంతి తీసుకున్న వెంకయ్య..ఆ తర్వాత లాయర్ వార పత్రిక 40వ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరుకు చెందిన పలువురు స్నేహితులను ఆయన్ని ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల కాలంలో రాజకీయ నేతలు మాట్లాడే మాటలు రోత కలిగిస్తున్నాయన్న వెంకయ్య...కొందరిలోనైనా మార్పు వస్తుందనే రోత అనే పదం వాడుతున్నట్లు తెలిపారు. ప్రజలతో ఉంటే వచ్చే ఆనందమే వేరని వెంకయ్యనాయుడు అన్నారు.

పత్రికలు, పుస్తకాలు చదవటం వల్లే తనకు జ్ఞానం వచ్చిందని వెంకయ్యనాయుడు తెలిపారు. రానురానూ పత్రికల విలువలు మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన వెంకయ్య.. మాతృభాష ప్రాధాన్యతను పత్రికలు తెలియజేయాలని కోరారు.

రెండో రోజు పర్యటనలో దివ్యాంగుల కేంద్రాన్ని సందర్శించనున్న ఉపరాష్ట్రపతి..... అనంతరం సందర్శకులతో ముచ్చటిస్తారు. ఆదివారం స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

ప్రజలను చైతన్యపరచాలి...

దేశాభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేలా వారిని చైతన్యపరచాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(venkaiah naidu news) సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతి నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు, ఆరోగ్య సంరక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, ప్రజాజీవితంలో నైతిక విలువలపై వెంకయ్యనాయుడు మాట్లాడారు. 'సబ్ కా సాత్‌.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజాభాగస్వామ్యం పెరగడంలో కృషి చేయడంతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ సమర్థంగా అమలు కావడంలోనూ చొరవ తీసుకోవాలన్నారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రజాజీవితంలో విస్తృతమైన అనుభవం ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. పథకాల అమలు సమర్థంగా జరగడంలో తమ అనుభవాన్ని, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు.

ఇవీచదవండి.

Last Updated : Nov 13, 2021, 3:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.