'కూటి కోసం, కూలి కోసం పట్నమొచ్చిన బాటసారికెంత కష్టం' ….అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన కవిత ఈ వలస కూలీల వేదనకు అద్దం పడుతోంది. వీరంతా.. పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. తిరుపతి, చెన్నైలో వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. లాక్‌డౌన్..ఈ రోజు కూలీల జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేసింది. పనుల్లేవు. పైసల్లేవు. ఇక..... ఈ క్షుద్బాధ భరించలేమంటూ ...సుమారు 70 మంది కూలీలు సొంతూళ్లకు బయల్దేరారు. చెన్నై, తిరుపతి నుంచి రెండ్రోజుల క్రితం మూటముళ్లె సర్దుకుని, పిల్లపాపల్ని చంకెనత్తుకుని కాలినడకన స్వగ్రామాలకు పయనమయ్యారు. నెల్లూరు వద్ద జాతీయ రహదారి వెంట నడుస్తూ వెళ్తుండగా పలకరించిన ఈటీవీకి.... వారి గోడు వెళ్లబోసుకున్నారు. సొంతూరు వెళ్లేదాకా ఆగబోమని వీరు అంటున్నారు.
ఆదివారం కాలినడకన బయల్దేరాం. ఇక్కడ మాకు ఆహారమైనా సరిగ్గా దొరకట్లేదు. కేవలంఒక్కసారే ఆహారమిచ్చారు. ఎక్కడైనా మంచినీరు పట్టుకునేందుకు ప్రయత్నించినా.... కొన్నిచోట్ల అనుమతించట్లేదు. కాళ్లు కొట్టుకుపోతున్నాయి. వెన్ను నొప్పి వస్తోంది. ఐనా మేం ఆగాలనుకోవట్లేదు.
నెల్లూరు వద్ద ఆహారం, మంచినీళ్లు అందించిన జనవిజ్ఞాన వేదిక సభ్యులు.... వలస కూలీల వేదన విని చలించిపోయారు.
ఇవీ చదవండి...