ETV Bharat / city

ఉద్యోగినిపై అధికారి దాడి ఘటన: నిందితునిపై నిర్భయ కేసు

నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో ఉద్యోగినిపై దాడికి పాల్పడిన భాస్కర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిర్భయ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్​ భాస్కర్​ను సస్పెండ్​ చేశారు.

మాస్క్​ వేసుకోవాలని చెప్పినందుకు ఉద్యోగినిపై అధికారి దాడి

author img

By

Published : Jun 30, 2020, 10:43 AM IST

Updated : Jun 30, 2020, 1:55 PM IST

మాస్క్​ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై అధికారి చాక్​, కర్రతో దాడి

నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్.. చాక్​, కర్రతో దాడి చేశాడు. కరోనా నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు ఆగ్రహించిన మేనేజర్... ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మేనేజర్​ అరెస్టు.. సస్పెండ్​

ఉద్యోగిని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి తెగబడ్డ మేనేజర్​ భాస్కర్​ను అరెస్టు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్​ మేనేజర్​ భాస్కర్​ను సస్పెండ్​ చేశారు.

భాస్కర్​పై నిర్భయ కేసు

ఏపీ టూరిజం హోటల్​ డిప్యూటీ మేనేజర్​ భాస్కర్​పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీశ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళపై దాడి చేయడం దారుణమన్న డీఎస్పీ.. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని అన్నారు.

ఇదీ చూడండి..

విశాఖ సాయినార్​ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్... ఇద్దరు మృతి

Last Updated : Jun 30, 2020, 1:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.