నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో తెదేపా నేతలు కొద్దిసేపు బైఠాయించారు. నగరపాలక ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కాకర్ల తిరుమల నాయుడు ఓట్లు గల్లంతు కావడంపై కార్యాలయానికి వెళ్లారు. దీనికి గల కారణాలపై అక్కడి అధికారులను ప్రశ్నించారు. తమ ఓట్లు ఎందుకు తొలగించారని అధికారులను నిలదీశారు.
నెల్లూరు నగర నియోజక వర్గం ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మద్దతుగా నిలిచారు. అధికార పార్టీకి అనుకూలంగా నగర పాలక సంస్థ అధికారులు పని చేస్తున్నారని ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కాకర్ల తిరుమల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అసెంబ్లీ రోల్స్ లో ఉండగా మున్సిపల్ రోల్స్ సంబంధించి ఓట్లు కనిపించకపోవడంతో నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: