టిడ్కో భవనాలకు వైకాపా రంగులు వేస్తుండగా తెదేపా నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో తెదేపా హయాంలో పేదల కోసం నిర్మించిన 1,028 భవనాలకు రంగులు మారుస్తున్నారని తెలుసుకున్న తెదేపా నేతలు అక్కడకు చేరుకుని నిరసనకు దిగారు.
పేదలకు ఉచితంగా భవనాలు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామే కానీ.. తెదేపా హయాంలో నిర్మించిన గృహాలకు రంగులు మార్చడం సరికాదని తెదేపా నాయకులు తుమ్మల చంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగుల మార్పునకు ప్రభుత్వం జీవో జారీచేస్తే.. గృహ నిర్మాణ అధికారులు చూపాలని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా రంగుల మార్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడాన్ని ఖండించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: