మహాకవి తిక్కన మహాభారతాన్ని రాసిన ప్రదేశంలో నిర్మితమవుతున్న నెల్లూరు పెన్నా బ్యారేజీకి తిక్కన బ్యారేజీగా నామకరణం చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ బ్యారేజీకి మహాకవి పేరు పెట్టడం ద్వారా తిక్కన కోసం పరితపించిన దివంగత గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కల నెరవేరుతుందని తెదేపా నేత భువనేశ్వర ప్రసాద్ అన్నారు. పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని రంగనాధుని సాక్షిగా ఇప్పుడు నిర్మాణం జరిగే బ్యారేజీ ప్రాంతంలో తిక్కన తెలుగులోకి అనువదించారని తెలిపారు. ప్రకాశం బ్యారేజికి ప్రకాశం పంతులు పేరు పెట్టినట్లు, తిక్కన పేరు చిరస్థాయిగా నిలిచేలా పెన్నా బ్యారేజీకి ఆయన పేరు పెట్టాలన్నారు. ఇందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలు సహకారించాలని కోరారు.
ఇదీ చదవండి: