ETV Bharat / city

'బరితెగిస్తున్నారు.. ఏకపక్షంగా ఎన్నికలు జరిగేందుకు దాడులు చేస్తున్నారు' - Ysrcp Goons Attack News today

మాముడూరు పోలింగ్ కేంద్రంలో అధికార పార్టీ ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని స్వతంత్ర అభ్యర్థులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగా.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఇండిపెండెంట్ అభ్యర్థులపై వైకాపా శ్రేణులు దాడికి దిగినట్టు బాధితులు ఆరోపించారు.

'మా మీదే ఫిర్యాదు చేస్తారా'.. అభ్యర్థులపై వైకాపా దాడి

author img

By

Published : Apr 8, 2021, 4:53 PM IST

నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం మాముడూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులు అనుకూలించే వరకు అధికారులు కాసేపు ఎన్నికల ప్రక్రియ నిలిపివేశారు. వైకాపా ఏజెంట్ల వ్యవహారంపై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

'గూండాలను పెట్టారు'

వైకాపా నేర చరితులను, రౌడీ షీటర్లను తమ ఏజెంట్లుగా పెట్టిందంటూ స్వతంత్ర అభ్యర్థి.. ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

'మా మీదే ఫిర్యాదు చేస్తారా'

మా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ వైకాపా కార్యకర్తలు, ఆ పార్టీ ఏజెంట్లు.. తమపై దాడికి తెగబడ్డారని స్వతంత్ర అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో.. మహిళా స్వతంత్ర అభ్యర్థి సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

'ఏజెంట్ లేకుండానే'

ఒకటో పోలింగ్ కేంద్రం వద్ద తమ తరఫున ఏజెంట్ లేకుండానే ఓటింగ్ కొనసాగుతోందని ఇండిపెండెంట్ అభ్యర్థి వాపోయారు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

'పోలీసులు.. మా ఫోన్లు లాక్కున్నారు'

ఘర్షణ జరిగే సమయంలో కొంత మంది తమ ఫోన్లలో చిత్రీకరిస్తుండగా ఫోన్లను పోలీసులు లాక్కున్నారని స్వతంత్ర అభ్యర్థి పేర్కొన్నారు. అధికార‌ పార్టీ నేతలు బరి తెగించి ఎన్నికలను ఏక పక్షంగా జరిగేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

కెమికల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.