నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన శిల్ప కళాకారుడు మంచాల సనత్ కుమార్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని సాగర తీరంలో ఇసుకపై అద్భుతమైన చిత్రాలను మలచారు. తన నైపుణ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
రైతు లేనిదే మానవ మనుగడ లేదు.. అటువంటి రైతు దినోత్సవాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అండగా నిలవాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి:
Boy missing: 8 రోజులైంది అడవిలో తప్పిపోయి.. ఎక్కడున్నావ్రా చిన్నా.. త్వరగా ఇంటికి రా!