Police protest: నెల్లూరు జిల్లాలో ఏఆర్ పోలీసుల బదిలీ వివాదాస్పదంగా మారింది. బదిలీలపై సిబ్బంది ఏకంగా నిరసనకు దిగారు. సీనియార్టీ లిస్ట్ పట్టించుకోకుండా.....తమను ఇతర జిల్లాలకు మార్చారంటూ నెల్లూరు జిల్లాఎస్పీ కార్యాలయం సమీపంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ వద్ద..కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే రిటైర్మెంట్ తీసుకుంటామని అన్నారు. ఆందోళన చేస్తున్న సిబ్బందికి అధికారులు సర్ది చెప్పారు. కార్యాలయంలో కూర్చోపెట్టి చర్చలు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: ఏపీ వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు