నెల్లూరు జిల్లాలోని కోవూరులో ఏఎస్పీ స్థాయి పోలీస్ అధికారి మద్యం మత్తులో హల్‌చల్ సృష్టించారు. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోలో ఏఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న శ్రీధర్ బాబు నెల్లూరు గ్రాండ్ హోటల్‌కు కారులో వచ్చారు. మద్యం మత్తులో స్థానికులను, చుట్టుపక్కన ఉన్నవారిని అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ, పలువురిపై దాడికి పాల్పడ్డాడు. అటుగా వచ్చిన బస్సులో నుంచి దిగిన మహిళా ప్రయాణికులనూ దూషించారు.
సర్వత్రా ఆగ్రహం..
పోలీస్ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, అతను వచ్చిన వాహనాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులను ఫుల్లుగా తాగిన ఆ అధికారి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు.
ఠాణా ఎదుట ఆందోళన..
పోలీసు అధికారిని శిక్షించాలంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సదరు అధికారిని వైద్య పరీక్షల కోసం నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: