ETV Bharat / city

ఆన్​లైన్​లో పాఠాలు.. విద్యార్థులకు మేలు..! - online classes problems news in nellore

కరోనా.. విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు అన్ని పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్​పై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్న తరుణంలో.. ఆన్​లైన్​లో విద్యా బోధన కొంత ఊరటనిస్తోంది. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ పాఠ్యాంశాలు బోధించడం సాధ్యం కాదు. ఈ క్రమంలో ఈ విధానమే మేలని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా చదువుకోకపోవడం ఇబ్బందికర పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆన్​లైన్​లో పాఠాలు.. విద్యార్థులకు మేలు..!

author img

By

Published : Jun 23, 2020, 9:10 PM IST

ఆన్​లైన్​లో విద్యార్థులకు పాఠాలు

కరోనా ప్రభావంతో దాదాపు అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థుల భవిష్యత్​ అగమ్యగోచరం కాకుండా ఉండాలంటే.. ఆన్​లైన్​లో విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో ప్రైవేట్​, కార్పొరేట్​ పాఠశాలలు, కళాశాలలు ఆన్​లైన్​లో.. జూమ్​ యాప్​ ద్వారా విద్యా బోధన కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్​ విద్యను సైతం ఆన్​లైన్​లోనే బోధిస్తున్నారు.

ఇబ్బందున్నా.. బాగానే ఉంది

ఆన్​లైన్​లో విద్యా బోధనపై విద్యార్థుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. తరగతి గదిలో తోటి వారితో కలిసి చదువుకునే పరిస్థితికి భిన్నంగా ప్రస్తుత విధానం ఉందని.. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా తప్పడం లేదని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు నిపుణులైన బోధకులు ఆన్​లైన్​లో పాఠ్యాంశాలు వివరిస్తే.. చక్కగా అర్థమవుతాయని.. ఆన్​లైన్​ తరగతులు బాగున్నాయని కొందరు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెరుగైనదే..

కరోనా దృష్ట్యా ఆన్​లైన్​ విధానం చాలా మేలైనదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లలకు అనుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా.. పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఆన్​లైన్​ విధానం మేలైనప్పటికీ.. కొన్ని ఇబ్బందులున్నాయని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల శ్రమ, ఫీజుల భారం, పుస్తకాల మోత ఉండదని.. అయితే తరగతిలో ఉత్సాహంగా చదువుకునే వాతావరణం దీని వల్ల రాదని అంటున్నారు. ఇది పిల్లల మానసిక ఒత్తిడి కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆన్​లైన్​లో తరగతులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో జరిగితే మేలని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి..

ఈనెల 29న ఇస్రో ఆధ్వర్యంలో ఉచిత కోర్సు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.