నెల్లూరు జిల్లా మనుబోలు బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా తనను చేర్చుకోలేదు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తన బాధను వీడియో రూపంలో వెలిబుచ్చారు. తాను డయాలసిస్ పేషెంట్‌నని, రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధితుడు చెప్పారు.
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంతో సాధించానని.. ఇటీవల నాడు-నేడు కార్యక్రమం ద్వారా నా పాఠశాల అభివృద్ధికి కృషి చేసి... ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి ప్రశంసలు అందుకున్నానని ఆయన చెప్పారు. తనను చేర్చుకునేలా ఆస్పత్రి సిబ్బందికి సూచించాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు వీడియోలో విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆస్పత్రి అధికారులు చివరకు ఆయన్ను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.
ఇదీ చూడండి..