నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి... బ్యాంకుల ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా కేంద్ర సహకార బ్యాంకు రూ.100 కోట్ల రూపాయలు రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. 3 లక్షల రూపాయల వరకు 7% వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు.
సకాలంలో రుణం చెల్లిస్తే లక్ష రూపాయల వరకు వడ్డీ లేకుండా చూస్తామని చెప్పారు. 2 లక్షల రూపాయలకు 33 పైసల వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం దారులకు రైతులకు రెండు లక్షల రుణానికి 7 శాతం వడ్డీ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
సకాలంలో చెల్లిస్తే 33 పైసలు మాత్రమే కట్టవలసి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: