భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి నెల్లూరు వచ్చిన సోము వీర్రాజుకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వేదాయపాలెం నుంచి రామ్మూర్తి నగర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని.. రానున్న ఎన్నికల్లో భాజపాకు పట్టం కట్టాలని వీర్రాజు పిలుపునిచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను.. కార్యక్రమం ప్రారంభం కాకముందే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. కొన్నింటిని తిరిగి ఏర్పాటు చేశారు.
ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ కోరింది. వేదయపాలెం సెంటర్ వద్ద ఆ సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య.. ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యను పరిష్కరిస్తే భాజపాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ప్రకటించారు. అందుకు పార్టీ కృషి చేస్తుందని.. రానున్న ఎన్నికల్లో అందరూ ఐక్యంగా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని వీర్రాజు తెలిపారు.
ఇదీ చదవండి: