బెయిల్ పై విడుదలైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో పాటు సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేశారు. ఎస్పీ కావాలనే తనని అరెస్ట్ చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి వద్దకు రావడమేంటని ప్రశ్నించారు. తన అరెస్టులో వైకాపా నాయకుల కుట్ర ఉందని అన్నారు. సాక్ష్యాలతో నిరూపిస్తే ఎంపీడీవో సరళ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు!