నెల్లూరు జిల్లా అధికారులతో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. కరోనా నివారణ చర్యలపై సమీక్షించారు. ధాన్యం సేకరణను ముమ్మరం చేయాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను పెంచాలని... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రైతు కూలీలు, ఉపాధిహామీ కూలీలకు అవరోధాలు లేకుండా చూడాలని అన్నారు. మొబైల్ యాప్ ద్వారా కరోనా కేసుల వివరాలను పరిశీలించాలని పేర్కొన్నారు.
జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. క్వారంటైన్ వివరాలు, జిల్లాలో హాట్ స్పాట్ సెంటర్లుగా గుర్తించిన ప్రాంతాల్లోని పరిస్థితులపై సమీక్షించారు.
ఇదీ చదవండి: