కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నెల్లూరు మూలస్థానేశ్వరస్వామి వారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు జరగనున్న కార్తీకమాసం ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. కరోనా దృష్ట్యా ఆలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా కారణంగా ఈసారి ప్రదక్షిణాలు నిలిపివేస్తున్నామని, సామాజిక దూరం పాటిస్తూ దీపాలు వెలిగించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.
భక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. విద్యుత్, పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోందని, శివుని ఆశీస్సులతో సాధారణ పరిస్థితులు నెలకొనాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చదవండి