నెల్లూరు నగరంలో మహావీర్ జన్మదిన వేడుకలు సాదాసీదాగా నిర్వహించారు. ఏటా నగరంలో పెద్ద ఎత్తున జైన మత 24వ తీర్థంకర్ భగవాన్ మహావీర్ జన్మదిన వేడుకలు చేసేవారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సామాజిక దూరం పాటించాలనే నిబంధనలకు మద్దతుగా జైన కుటుంబాలు సాదాసీదాగా వేడుకలు నిర్వహించారు. తదూరి జైన సమాజం తరఫున పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో పూజలు చేసుకున్నారు. కరోనా వైరస్ నుంచి దేశాన్ని రక్షించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: