ETV Bharat / city

ప్రవాసీయులను తిప్పి పంపే దిశగా కువైట్‌ అడుగులు - Kuwait steps in to repatriate migrants

బతుకులపై బండ పడుతోంది.. పట్టెడన్నం కోసం పొరుగు దేశాలకు వలస వెళ్లిన సింహపురీయులకు ఇబ్బంది ఏర్పడుతోంది.. ప్రస్తుతం కువైట్‌ తీసుకుంటున్న నిర్ణయంతో ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు వెనక్కి వచ్చే పరిస్థితి తలెత్తుతోంది. కరోనా కారణంగా జీవితాలే తలకిందులవుతుండటం ఇక్కడ కీలకంగా మారింది.

Kuwait steps
Kuwait steps
author img

By

Published : Jul 10, 2020, 2:08 PM IST

రాయలసీమ జిల్లాలతో పాటు అనుబంధంగా ఉండే నెల్లూరు, ప్రకాశం నుంచి అనేక మంది ఏళ్ల తరబడి ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నారు. ఒక్క కడప జిల్లా నుంచే ఈ లెక్క 20 వేల మందికి పైగా ఉండగా.. ఆ జిల్లా సరిహద్దుగా ఉండే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, మర్రిపాడు, ఆత్మకూరు, ఏఎస్‌పేట, వరికుంటపాడు తదితర మండలాలకు చెందిన దాదాపు 3 వేల మంది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నారు. కువైట్‌, సౌదీ, దుబాయ్‌, ఖతార్‌.. ఇలా అనేక దేశాల్లో ఇంటి పనులు, గొర్రెల కాపరులుగా వెళ్లిన పరిస్థితి ఉంది. కొందరు ప్రైవేటు సంస్థల్లో కార్మికులు, ఉద్యోగులుగానూ పని చేస్తున్నారు. కరోనా విస్తరణ నేపథ్యంలో కొందరు స్వస్థలాలకు తిరిగి రాగా.. మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు వారిపై శరాఘాతంగా మారుతున్నాయి.

ఇదీ పరిస్థితి

జనాభా పరంగా స్వదేశీయులను మించిపోయిన ప్రవాసీయులను తిప్పి పంపే దిశగా కువైట్‌ అడుగులు వేస్తోంది. ఆ సంఖ్యను దశలవారీగా తగ్గించుకోవడానికి ఓ ముసాయిదాను అక్కడి పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. ప్రవాసీయుల సంఖ్యను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించుకునేందుకు నిర్ణయించుకుంది. భారతీయుల సంఖ్యను 15 శాతానికి మించకూడదని తాజా బిల్లులో పేర్కొన్నారు. అది చట్టరూపం దాల్చితే దాదాపు 8 లక్షల మంది భారతీయులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఆ క్రమంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన నిరుపేదలు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ స్థితిలో అనేక కుటుంబాలపై ఆ ప్రభావం పడనుంది. గల్ఫ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికీ ఇది అవరోధంగా మారనుంది. ఇక జిల్లా నుంచి పలువురు విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు. ఇటీవల ఫిలిప్పైన్స్‌లో కొందరు జిల్లా విద్యార్థులు వెనక్కి రాలేక విమానాశ్రయంలో చిక్కుకుపోయి అష్టకష్టాలు పడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ స్థితిలో అమెరికాలోని విద్యాలయాల్లో ఆన్‌లైన్‌ మాధ్యమంలో వివిధ కోర్సులు అభ్యసించాలనుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో జిల్లా నుంచి అక్కడ చదువుకునేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థులపై ప్రభావం చూపనుంది. మొత్తంగా కొవిడ్‌ కారణంగా పొరుగు దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న జిల్లావాసులకు ఇబ్బంది ఏర్పడుతోంది.

ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 26,506 కేసులు.. 475 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.