ETV Bharat / city

పేదల కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్​లో జనసేన చేపల వేట - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం పేదల కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్​లో జనసేన నేతలు చేపలు పట్టారు. చిన్నపాటి వర్షానికే లేఅవుట్​లో ఆరడుగుల లోతు నీరు చేరిందని..అలాంటి భూములను పేదలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.

nlr-fish
nlr-fish
author img

By

Published : Dec 2, 2020, 10:29 AM IST

రాష్ట్ర ప్రభుత్వం పేదలకిచ్చేందుకు సిద్ధం చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్​లో జనసేన నాయకులు చేపలు పట్టారు. మంగళవారం నెల్లూరు భగవత్​సింగ్ కాలనీలో జగనన్న లేఅవుట్​ను నెల్లూరు జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పరిశీలించారు. పేదలకు ఇచ్చే స్థలంతోపాటు ఒక పడవ, లైఫ్​జాకెట్ ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. చిన్నపాటి వర్షానికే ఆరడుగుల లోతులో నీరు నిలిచే ప్రాంతాలను పేదలకు కేటాయించారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: నూతన ఇసుక విధానంపై తెదేపా నిరసన ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.