నివర్ తుపాను ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో అత్యధికంగా 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 9 చోట్ల 20 సెం.మీ నుంచి 30 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. 72 చోట్ల 11.5 నుంచి 20 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో 6 నుంచి 11 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసినట్టు తెలిపింది.
ఇవీ చదవండి..