ETV Bharat / city

Guinness World Record Painting : గిన్నిస్ రికార్డు మీద కన్నేశాడు...భారీ చిత్రాన్ని గీశాడు - గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పెయింటింగ్స్

Guinness Record Painting : ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నా.. గిన్నిస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డే అతని లక్ష్యం. అందుకోసం ఎన్నో ఏళ్లు శ్రమించాడు. తన పెయింటింగ్‌ కోసం కాలం చెల్లిన, పనికి రాని కారం, పసుపు పొడులను ఉపయోగించి.. 790 అడుగుల చిత్రం గీసి ఔరా అనిపించాడు..

Guinness World Record Painting
గిన్నిస్ రికార్డు మీద కన్నేశాడు...భారీ చిత్రాన్ని గీశాడు...
author img

By

Published : Feb 8, 2022, 2:34 PM IST

Guinness World Record Painting : గిన్నిస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్.. ఈ టైటిల్ ని సొంతం సొంతం చేసుకోవటం అంత సులువేమీ కాదు. ఎంతో మంది తమ ప్రతిభను చాటుకునేందుకు..తమ పేరు ఆ పుస్తకంలో ఎక్కేందుకు.. ఎన్నో ఏళ్లుగా అహర్నిశలూ శ్రమిస్తూ ఉంటారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తే.. నెల్లూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు అమీర్‌ జాన్. గిన్నిస్ బుక్ ఆఫ్‌ రికార్డును సాధించేందుకు అమీర్‌ జాన్.. భారీ స్పైస్‌ చిత్రాన్ని గీశాడు. ఆరున్నర గంటల్లో 790 అడుగుల చిత్రం గీసి.. అందరి చేతా ఔరా అనిపించాడు.

గిన్నిస్ రికార్డు మీద కన్నేశాడు...భారీ చిత్రాన్ని గీశాడు...

నెల్లూరుకి చెందిన చిత్రకారుడు అమీర్ జాన్ బహుముఖ చిత్రాలను గీస్తారు. విభిన్న చిత్రాలు గీసి 40కి పైగా రికార్డులు సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్​లో స్థానం సాధించాలనే లక్ష్యంతో.. మహారాష్ట్రలోని ఆదివాసీ మహిళలు రూపొందించిన వర్లీ చిత్రకళను రూపొందించారు. అమీర్‌జాన్‌ తన పెయింటింగ్‌ కోసం కాలం చెల్లిన, పనికి రాని కారం, పసుపు పొడులను ఉపయోగించారు. ఫుడ్‌ సెఫ్టీ అధికారి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అధికారుల సమక్షంలో ఈ చిత్రాన్ని గీశారు. మొత్తం 25 కళాసంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి : మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్​లో గేమ్స్... ఆ తర్వాత పరిస్థితి చూస్తే..

Largest Spice Painting : 790అడుగుల చిత్రాన్ని 6 గంటల30నిమిషాల్లో చిత్రీకరించారు. ఉత్తరప్రదేశ్ చిత్రకారుడి పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం పంపేందుకు ఈ కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీయించారు. అమీర్‌జాన్‌ 30ఏళ్లుగా పాఠశాల నిర్వహిస్తున్నారు. సేవా భావంతో విద్యార్ధులకు చిత్రకళనూ నేర్పిస్తున్నారు. గిన్నిస్‌ రికార్డు సాధించటమే లక్ష్యంగా... భారీ స్పైస్‌ పెయింటింగ్‌ వేసినట్లు చెప్పారు.

" వర్లీ పెయింటింగ్ పురాతన చిత్రకళ. మన ప్రాచీన కళను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. ఈ చిత్రాన్ని నేను కాలం చెల్లిన, పనికి రాని పసుపు, కారం పొడులతో రూపొందిస్తున్నాను. ఫుడ్‌ సెఫ్టీ అధికారులు తినేందుకు పనికిరావని తేల్చి చెప్పిన తరువాతే వాటిని నా చిత్రాలను గీయడానికి ఉపయోగిస్తున్నాను. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 48 రికార్డులు సాధించాను. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించడం నా ఆశయం. నెల్లూరు జిల్లాలో పెయింటింగ్ విభాగంలో గిన్నిస్ రికార్డు నాపేరు మీద సాధించడమే నా లక్ష్యం. గిన్నిస్ బుక్ లో రికార్డు అవుతానని నమ్మకంగా ఉన్నాను. " - అమీర్ జాన్, చిత్రకారుడు

" గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం లార్జెస్ట్ స్పైస్ పెయింటింగ్ అనే పేరుతో 790అడుగుల చిత్రాన్ని వేయటం జరుగుతుంది. ఈ చిత్ర రూపకల్పన మొత్తాన్ని వీడియో తీయడం,ఫోటోలు తీయడం, డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. వీటన్నింటిని సాక్షుల ఆధ్వర్యంలో, పరిశీలకులు, ఫుడ్‌ సెఫ్టీ అధికారి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అధికారుల సమక్షంలో రూపొందించి ఈ చిత్రాన్ని పరిశీలను పంపడం జరుగుతుంది. అన్నింటిని పరిశీలించిన తరువాత గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నమోదు చేయడం జరుగుతుంది. " -రవీంద్ర, గిన్నిస్ వరల్డ్ రికార్డు టీమ్ సభ్యుడు

ఇదీ చదవండి :

Minister Balineni On Power Cut: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి ?: మంత్రి బాలినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.