ETV Bharat / city

dussehra : వైభవంగా దసరా వేడుకలు... ఆలయాల్లో భక్తుల రద్దీ - dussehra festival in andhrapradhesh

రాష్ట్రవ్యాప్తంగా విజయదశమి వేడుకలు(dussehra celebrations) ఘనంగా జరిగాయి. ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు(devotees) భారీగా తరలివచ్చారు. అమ్మవారి నామ స్మరణతో ఆలయాలు(temples) ప్రతిధ్వనించాయి. దసరా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు(police security) నిర్వహించారు.

వైభవంగా దసరా వేడుకలు
వైభవంగా దసరా వేడుకలు
author img

By

Published : Oct 15, 2021, 4:44 PM IST

ప్రముఖ శైవ క్షేత్రం మహానంది(mahanandhi)లో శ్రీకామేశ్వరీ దేవి అమ్మవారు సిద్దిధాత్రి దుర్గ(siddhidhathri durga) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖపట్నం జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధి(simhadri appanna temple)లో వైభవంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. శారదా పీఠం(sharadha peetham)లో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. దసరా పర్వదినాన శ్రీశారదాస్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చారు. స్వామి సన్నిధిలో ఆయుధ పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రంపాలిత ప్రాంతం యానాంలో(yanam) దుర్గమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వాసవీ కన్యకాపరమేశ్వరిని వెండిచీర, రాజరాజేశ్వరి దేవిని బంగారుకిరీటం, లలితాదేవిని దుర్గామాతగా అలంకరించారు.

నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం(nellore rajarajeshwari devi temple)లో ముగ్గులు వేసి, ప్రత్యేక పూజలు చేశారు. శిల్ప కళా సంపదకు నెలవైన అనంతపురం జిల్లా లేపాక్షి(lepakshi) ఆలయంలో స్తంభంలో ఆవిర్భవించిన దుర్గాదేవికి విశేష పూజలు చేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలు శోభయమానంగా మారాయి. పైడితల్లి ఆలయంలో(paidithalli temple) అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో అలంకరించారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.