Farmer suicide attempt: నెల్లూరు జిల్లా సంగం తహసీల్దారు కార్యాలయం వద్ద పెరమన గ్రామానికి చెందిన కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ...తహసీల్దారు కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని కుప్పగా పోసి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో..... పెరమన గ్రామానికి చెందిన కౌలు రైతు కిరణ్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. అతను గత ఏడాది తన 2 ఎకరాల పొలంతో పాటు...మరో 80 ఎకరాలు కౌలుకు తీసుకుని ధాన్యం పండించాడు.
గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్ట పోయాడు. తన రెండు ఎకరాలు అమ్మి అప్పులు తీర్చాడు. ఈ ఏడాది కూడా 40 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ సారీ ధాన్యం కొనే నాథుడు లేక తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన చేపట్టినా వారు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురైన కిరణ్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడ్ని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: Murder: చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. నరికి చంపిన అన్న