నెల్లూరులో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం బకాయిలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులున్న వైకాపా ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు. రైతు కుటుంబం బాగుంటేనే..రాష్ట్రం బాగుంటుందని జగన్ అన్నారు.
ఏపీలో యూరియా కొరత లేకుండా అమలు చేస్తున్నామని జగన్ అన్నారు. పక్క రాష్ట్రంలో యూరియా లేక రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో.. చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: కొండవీడుకోట అందాలు చూద్దం రారండీ!