కొవిడ్ కేర్ సెంటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు. సరైన మౌలిక సదుపాయాలు లేక కరోనా బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించి ఏరియా ఆసుపత్రిని క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని కోరారు. కరోనా బాధితుల పట్ల ఇతరులు వివక్ష చూపకుండా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండి :