ETV Bharat / city

'వైకాపా ఆగడాలను ఎదుర్కొంటాం' - kanna lakshminaraya latest news in nellore

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడిలో గాయపడి, నెల్లూరులోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన పరామర్శించారు.

భాజపా అభ్యర్థిని పరామర్శిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ

author img

By

Published : Mar 17, 2020, 1:24 PM IST

Updated : Mar 17, 2020, 3:43 PM IST

భాజపా అభ్యర్థిని పరామర్శిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైకాపా అక్రమాలపై కార్యకర్తలు, అభ్యర్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడిలో గాయపడి, నెల్లూరులోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాజపా అభ్యర్థి మునెమ్మను ఆయన పరామర్శించారు. కార్యకర్తలకు, అభ్యర్థులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, వైకాపా ఆగడాలను తాము ఎదుర్కొంటామని కన్నా ప్రకటించారు. కావలి భాజపా ఇన్​ఛార్జ్​ సుధాకర్​పై అధికారులు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. కావలి సబ్ కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. బెదిరింపులు, ప్రలోభాలతో ఏకగ్రీవమైన నామినేషన్లను రద్దు చేసే అంశంపై తాము న్యాయ సలహాలు తీసుకుంటున్నామన్నారు.

ఇదీ చూడండి:

'కేసుల్లో చిక్కుకున్న వైకాపా నేతలు.. రాజ్యసభకు క్యూ'

Last Updated : Mar 17, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.