భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన భార్యపై అత్తింటివారు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని దుర్గమ్మకాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
మరో మహిళతో వివాహేతర సంబంధం..
దుర్గమ్మకాలనీలో నివసించే వినయ్ కుమార్కు అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామానికి చెందిన శ్రీలక్ష్మీతో అయిదేళ్ల క్రితం వివాహమైంది. 5 లక్షల రూపాయల నగదు, పదిహేను సవర్ల బంగారమిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అప్పటికే మద్యానికి భానిసైన వినయ్ వివాహమైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడని బాధితురాలు చెబుతోంది. తనకు బాబు పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వెలిబుచ్చింది.
తనకు భర్త కావాలని తిరిగొస్తే అత్తింటివారు ఇంట్లోకి రానివ్వడం లేదని విలపిస్తోంది. మూడేళ్ల కుమారుడితో భర్త ఇంటి ముందే ఉంటున్న శ్రీలక్ష్మిపై అత్తింటివారు దాడికి పాల్పడ్డారు. దాడిని గుర్తించిన స్థానికులు శ్రీలక్ష్మిని రక్షించారు. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త తనను ఇంట్లోకి రానివ్వడం లేదని.. అలాగే తనను అత్తమామలు చంపేందుకు ప్రయత్నం చేశారని శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం జరిగే వరకు బిడ్డతో కలిసి అక్కడే ఉంటానని చెబుతోంది. దాడి సంఘటనపై ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: