Atmakur By Election Counting: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం ఈ రోజు వెల్లడికానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుందని, కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ హరీంధిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు 20 రౌండ్లతో పూర్తవుతుందన్న రిటర్నింగ్ అధికారి.. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతమూ కలగకుండా.. పటిష్టం బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఇవీ చదవండి: