ETV Bharat / city

ప్రేమించాడని చావబాదారు.. నంద్యాలలో వైకాపా నాయకుల దాష్టీకం - కర్నూలు లేటెస్ట్​ అప్​డేట్స్​

YSRCP leaders attacked a student: ప్రేమించాడని ఓ విద్యార్థిపై వైకాపా నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన నంద్యాల సాధిక్ ​నగర్​లో చోటుచేసుకుంది.

YSRCP leaders attacked a student
విద్యార్థిపై వైకాపా నాయకుల దాడి
author img

By

Published : Mar 25, 2022, 7:41 AM IST

Updated : Mar 25, 2022, 9:14 AM IST

YSRCP leaders attacked a student: కర్నూలు జిల్లా నంద్యాలలోని సాధిక్ ​నగర్​కు చెందిన సాయి హేమంత్ అనే యువకుడు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదివే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువు.. వైకాపా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కళాశాల నుంచి బయటకు వచ్చిన సాయి హేమంత్​ను ఓ కల్యాణ మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఓ గదిలో బంధించి దారుణంగా కొట్టారు. కత్తితో దాడి చేసి గాయపరిచారు. యువకుడి తండ్రికి ఫోన్ చేసి రమ్మని ఊరు విడిచి వెళ్లాలని హుకూం జారీ చేశారు. తీవ్రంగా గాయపడిన హేమంత్ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థిపై వైకాపా నాయకుల దాడి

"నేను క్లాస్​ అయిపోయి కిందికి వచ్చాను. టీస్టాల్​ దగ్గరకు వెళ్తుంటే డాడీకి యాక్సీడెండ్​ అయిందని చెప్పారు. నేను మా డాడీకి ఫోన్​ చేస్తుంటే ఫోన్​ లాక్కున్నారు. మా ఫ్రెండ్స్​ ఫోన్స్​ తీసుకుంటుంటే... ఎమర్జెన్సీ​ అని చెప్తుంటే ఇప్పుడు ఫోన్లు అవసరమా అని వాటిని కూడా లాక్కున్నారు. బైకుపై ఇద్దరు తీసుకెళ్లి గదిలో వేసి అయిదారుగురు కలిసి నన్ను కొట్టారు. మేము వైకాపావాళ్లం అని వాళ్లే చెప్పారు. అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి నాన్నకు కూడా వార్నింగ్​ ఇచ్చారు. రెండు నెలల్లో నంద్యాల వదిలిపెట్టి వెళ్లిపోవాలని... లేదంటే ఇద్దరినీ చంపేస్తామని బెదిరించారు." - సాయి హేమంత్​, బాధితుడు

ఇదీ చదవండి: "నాన్నా..పేదవాళ్లు చదువుకోకూడదా... డబ్బున్నవాళ్లే చదువుకోవాలా?"

Last Updated : Mar 25, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.