రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆక్సిజన్ కొరత వెంటాడుతూనే ఉంది. తాజాగా కర్నూలులోని కేఎస్ కేర్ ఆస్పత్రిలో నలుగురు కొవిడ్ రోగులు మృతి చెందారు. వారు ఆక్సిజన్ అందకనే మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆక్సిజన్ లేదని ఆందోళనతో ఇతర రోగులు.. వేరే ఆస్పత్రులకు వెళ్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ వీర పాండియన్... నలుగురు రోగులు చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆక్సిజన్ అందకనే వారు చనిపోయారని, అనుమతి లేకుండానే కొవిడ్ చికిత్సలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: