Sagged bridge : వరదల కారణంగా మధ్యలో కుంగిన వంతెనపైనే వారి ప్రయాణాలు. అటుగా వెళ్లాలంటేనే భయం కాని తప్పని పరిస్థితి. ప్రమాదమని తెలిసినా ప్రయాణం కొనసాగించక తప్పటం లేదు. 2009లో వచ్చిన వరద ధాటికి వంతెన మధ్యభాగాన కుంగి పోవడంతో... దానిపైనుంచి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. బిక్కు బిక్కుమంటూ వంతెన దాటాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలివ్వడమే తప్ప మరమ్మతులు చేయడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి తమకు నూతన వంతెన నిర్మించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : Mirchi Farmers Protest : గుండెలు మండిన మిర్చి రైతు..